దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్

దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : దళిత, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన భారత మాజీ ఉప ప్రధా ని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలను మాజీ ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్మరించారు. ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఆయన 119వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.
కులరహిత సమాజం నిర్మాణం, దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీ యమని కొనియాడారు. దళితుల సమగ్రాభివృద్ధికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఇద్దరూ రెండు కళ్లలాంటివారని పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి బడుగు, బలహీన వర్గాల కు హక్కులు కల్పిస్తే, ఆ హక్కులు అమలయ్యేలా కృషి చేసిన మహాను భావుడు జగ్జీవన్ రామ్ అని వివరించారు.
మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి:

సమాజంలో దళితులు పరిపాలన చేయలేరనే అపోహలను చెరిపివే స్తూ ఏ శాఖ ఇచ్చి నా సమర్థంగా నిర్వహించి తన ప్రతిభను నిరూపిం చిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజ అభ్యున్నతికి అంద రూ కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
1908లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్న వయ సులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన ప్రతిభను చాటుకున్నారన్నారు. దళిత, పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం, పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రేషన్ వ్యవ స్థను బలోపేతం చేయడం వంటి అనేక సంక్షేమ చర్యలు ఆయన దూర దృష్టి కి నిదర్శనమని తెలిపారు. ఈ హాస్టల్స్ ద్వారా ఎంతోమంది దళిత విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు.
-నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం తన లక్ష్యం:
జగ్జీవన్ రామ్ ఆశయాల దిశగా ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం తన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం స్పష్టం చేశారు. తాను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒకేసారి 100 గురుకుల పాఠశాలలు ప్రారంభించి, ఇప్పటికే ఉన్నవాటిని ఇంటర్ స్థాయి వరకు అభివృద్ధి చేశానని తెలిపారు. 2016లో డాక్టర్ అంబేద్క ర్ 125వ జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి 125 ఎస్సీ గురుకులాలను ఏర్పాటు చేయించామని చెప్పారు.
అలాగే ప్రస్తుతం ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం శిథిలావస్థలో ఉంది. 2027 ఏప్రిల్ 5 నాటికి కొత్త కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ కేంద్రంలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ పేర్లతో రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో భవనం నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా నియోజకవర్గ ప్రతిష్ఠను దెబ్బతీశారని అన్నారు. వ్యక్తిగత విమర్శలను పట్టించుకోనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డివో వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, తాసిల్దార్ స్వప్న, కౌన్సిలర్ లు చల్లా రమ్య రఘు రెడ్డి, బూర్ల రాజేశ్వర్, బొల్లు లక్ష్మి, పొన్నం స్వరూప, హైమ, రజిత, సౌదరపల్లి సంపత్ రాజ్, పొన్న రాజే ష్, బాలగాని అనిల్, కాంగ్రెస్ నాయకులు బెలిదే వెంకన్న, బూర్ల శంకర్, పోగుల సారంగ పాణి, నీల గట్టయ్య, గన్ను నరసింహులు, నియోజక వర్గ ప్రజా ప్రతిని ధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
