Gram Panchayat | నా లక్ష్యం అదే..

Gram Panchayat | నా లక్ష్యం అదే..
Gram Panchayat, పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని బొమ్మకల్లు గ్రామ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొడకంటి యాకన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కొడకంటి యాకన్న మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ (TPCC) ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ, రాజేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. బొమ్మకల్లు గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి, ఆదరించాలని, బొమ్మకల్లు గ్రామ సర్పంచ్ గా గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు.
గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో నిత్యం గ్రామంలో ఉంటూ గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
