Former | ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలి

Former | ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలి

అధికారుల‌కు ఎమ్మెల్యే ఆదేశం

Former | ఘంటసాల, ఆంధ్రప్రభ : వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని అవనిగడ్డ ఎమ్మెల్యే MLA మండలి బుద్ధ ప్రసాద్ అధికారులకు సూచించారు. ఈ రోజు ఘంటసాల త‌హ‌సీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు..? ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సి ఉంది..? అని ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ TDP మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, పీఏసీఎస్ అధ్యక్షుడు బండి పరాత్పరరావు, టీడీపీ నాయకులు గొర్రెపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply