Vemulawada : సిరిసిల్లాను ఉరిసిల్లగా మారుస్తున్న ప్రభుత్వం… కవిత

వేములవాడ : సిరిసిల్లను మళ్లీ ఉరిసిల్లగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ దక్షిణ కాశీగా పిలుచుకునే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని.. కేసీఆర్ 250కోట్లతో చేపట్టిన వేములవాడ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

గుడిచెరువు వద్ధ చేపట్టాల్సిన భక్తుల వసతులను చేపట్టాని కోరారు. కేసీఆర్ రాజన్న పేరుతో సిరిసిల్ల రాజన్న జిల్లాను ఏర్పాటు చేశారన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరుపొందిందని.. చేనేత కార్మికుల కోసం కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి డిమాండ్ చేస్తున్నామన్నారు.

కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్‌ను తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని..ఇలాంటి భేధభావన వైఖరి అవసరం లేదన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *