Govt | అంగరంగ వైభవంగా వార్షికోత్సవం…

Govt | అంగరంగ వైభవంగా వార్షికోత్సవం…

  • పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ…

Govt | గన్నవరంఆంధ్రప్రభ : గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రముఖ అర్చకులు గుదిమెళ్ల దిలీప్ కుమార్ ఆచార్యుల పర్యవేక్షణలో తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృత అభిషేకం, నవరసాభిషేకం, సింధూరాభిషేకంతో పాటు వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు.

అనంతరం లోకకల్యాణార్థం గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, ఆంజనేయ హోమం మరియు శాంతి హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన హోమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.

Govt |

ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Govt |

అనంతరం ఆయన యాగశాలలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గన్నవరం పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Govt |
Govt |
Govt |

Leave a Reply