మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఉచిత చేప పిల్లల పంపిణీతో ఆర్థిక ప్రగతి దిశగా ముదిరాజులు
ఒకే రిజర్వాయర్ నుంచే రూ.4 కోట్ల విలువైన చేపల ఉత్పత్తి!
మార్కెటింగ్, రవాణా సదుపాయాలపై అధికారం సూచనలు
రూ.4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం
ముదిరాజుల ఆర్థిక స్థాయిని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రిజర్వాయర్ లో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం


స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్ల లను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేస్తోందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్ రిజర్వాయర్ లో చేపల ఉత్పత్తిని పెంచేందుకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తో కలిసి ఆయన స్వయంగా చేప పిల్లలను రిజర్వాయర్‌లో వదిలారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల ను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదప డుతోంది. ఒక్క ఈ రిజర్వాయర్ ద్వారానే ఏటా దాదాపు రూ.4 కోట్ల విలువైన చేపల ఉత్పత్తి జరుగుతోంది. దాదాపు నాలుగు కోట్ల రూపా యల విలువైన చేపలు మార్కెట్లోకి వస్తున్నాయని తెలిపారు. ఉత్పత్తి పెరుగుతున్న తరుణంలో మార్కెటింగ్, రవాణా సదుపాయాలపై అధి కారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రస్తుతం రిజర్వాయర్ పరిధిలో 319 మహిళా సంఘాల సభ్యులు, 700 మంది మత్స్యకార సంఘ సభ్యు లు, మరో 300 మంది సభ్యత్వం కోసం అప్లై చేసుకు న్నారని మొత్తం 1300 మంది మత్స్యకారులు నెలకు పదివేల రూపా యలకు పైగా సంపాదించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమని పేర్కొ న్నారు. ఆగస్టు నెలలో చేప పిల్లలను వదిలే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి, చేపల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నియోజకవర్గంలోని ముదిరాజుల ఆర్థిక అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టు బడి ఉందని స్పష్టం చేశారు. అలాగే ఘన్ పూర్ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.50 కోట్ల రూపాయలు మంజూరు చేసి నట్టు తెలిపారు. అందులో మత్స్యకారులకు మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు నాలుగు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం త్వర లో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

చేప పిల్లల విడుదలతో మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధి సాధ్యం: కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్


జిల్లాలోని మొత్తం 736 చెరువులు, 9రిజర్వాయర్‌లలో కలిపి 2 కోట్ల 72 లక్షల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా లాంచనంగా చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మొత్తం ప్రక్రియ ఈ నెల చివరి వరకు పూర్తి అవుతుందన్నారు. ఈ చేప పిల్లల విడుదల ద్వారా 190 మత్స్య కారుల సహకార సంఘాలకు చెందిన 19వేల సభ్యులు, అలాగే వీరి మీద ఆధారపడిన దాదాపు 80 వేల మత్స్యకార కుటుంబాల జీవనో పాధి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే చేపలను డిమాండ్ అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా మార్కెటింగ్ చేసి, మత్స్యకారులు అధిక లాభాలను సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న, జిల్లా మత్స్య శాఖ అధికారి రానా ప్రతాప్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply