చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి గ్లోబల్ ఇన్విటేషన్

చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి గ్లోబల్ ఇన్విటేషన్

  • 20 దేశాల ప్రతినిధులతో వేదికపై చర్చ

ఆంద్రప్రభ, తిరుపతి (తుడా) : అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తనకిచ్చిన పదవికి వన్నెతెస్తూ తిరుపతి తుడాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూ తిరుపతి తుడా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్(Dollars Group) అధినేత, టీటీడీ బోర్డు మెంబర్, తిరుపతి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి(Dollars Diwakar Reddy)కి ప్రపంచస్థాయి గౌరవం దక్కింది.

తిరుపతిని స్మార్ట్‌ స్థిరాభివృద్ధి నగరంగా తీర్చిదిద్దడంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అరైజ్ సిటీస్ ఫోరమ్‌ 2025 పేరుతో అక్టోబర్‌ 8–9 తేదీలలో న్యూఢిల్లీ నగరం(New Delhi City)లో జరగబోయే ఈ అంతర్జాతీయ సమావేశంలో ఇరవైకి పైగా దేశాల ప్రభుత్వ ప్రతినిధులుప్రపంచ బ్యాంక్‌, ఆసియన్‌ డెవలప్మెంట్‌ బ్యాంక్‌(Asian Development Bank), ఐక్యరాజ్య సమితి, ఎన్‌.ఐ.యూ.ఏ, ఐసిఎల్‌ఇఐ వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థల అధికారులు స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, బ్రెజిల్‌, శ్రీలంక‌, నేపాల్‌, కెన్యా దేశాల రాయబారులు సరసన స్పీకర్ గా పాల్గొంటారు.

అంతర్జాతీయ ప్రతినిధులు సమక్షంలో మన తిరుపతి పట్టణ దృష్టి తెలివైన పచ్చదనంతో నిండిన, ప్రజల కేంద్రంగా ఉన్న అభివృద్ధి దిశ ప్రపంచ వేదికపై ప్రతిధ్వనించనుంది. తుడా చరిత్రలో ఒక మైలురాయిగా డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి మార్గదర్శకత్వంలో తీసుకున్న ప్రతి అడుగు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ప్రపంచ స్థాయి వేదిక పైకి స్పీకర్‌(Speaker)గా డాలర్స్ దివాకర్ రెడ్డికి ఆహ్వానం అందడంతో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply