Girl | విషాద ఘటన

Girl | విషాద ఘటన
Girl | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుపతిలో రీల్స్ చేయాలనే ఉత్సాహం విషాదంగా మారింది. ఐదో అంతస్తు నుంచి జారిపడి ఓ బాలిక మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజారెడ్డి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్ కుమార్తె (13) సోషల్ మీడియాలో రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురైంది.
ఐదో అంతస్తు నుంచి రీల్స్ చిత్రీకరిస్తుండగా బాలిక జారిపడి కిందపడడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ఆకర్షణలో యువత ప్రాణాలను పణంగా పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.
