Ghantasala | ఘంటసాల చరిత్ర ఘనం

Ghantasala | ఘంటసాల చరిత్ర ఘనం

  • చారిత్ర‌క చిహ్నాల‌ను సంద‌ర్శించిన ప్రముఖులు

Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆర్థిక సమతా మండలి పూర్వ కార్యదర్శులు వీరయ్య, నౌగోరాల కుమార్తె సబల, శ్రీధర్ దంపతులు బెంగళూరు నుంచి ఘంటసాల వచ్చి బౌద్ధ మ్యూజియం, బౌద్ధ స్తూపం తదితర చారిత్ర‌క‌ చిహ్నాలు సందర్శించారు. ఘనమైన ఘంటసాల చరిత్ర ఈ నాటికీ సజీవంగా చూసి ముగ్ధుల‌య్యారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మ‌న్ గొర్రెపాటి వెంకటరామకృష్ణ ఆర్ధిక సమతా మండలి( శ్రీకాకుళం) ద్వారా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయ‌ని, ప్రత్యేకించి ” వీవర్స్ కన్వెన్షన్ ” అమలు చేసి ఆదుకున్నారని చెప్పారు. ఏఎస్ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

Leave a Reply