AP | ఎలక్ట్రిక్ ఆటోల్లో చెత్త సేకరణ…

  • జగయ్యపేటలో ప్రయోగం

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేటలో 3 కోట్ల నిధులతో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శనివారం జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, అధికారులతో కలిసి పరిశీలించారు.

అనంతరంమున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, చైర్మన్ రాఘవేంద్రలు మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో డంపింగ్ విధానం, చెత్త సేకరణ, శానిటేషన్ తదితర అంశాలపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జగ్గయ్యపేట పురపాలక సంఘంపై వరాలు పట్టాభిరామ్ కురిపించారు.చెత్త సేకరణకు 10 ఎలక్ట్రిక్ ఆటోలను అందజేస్తామని హామీ ఇచ్చారు.50% సబ్సిడీపై రెండు కాంపాక్టర్లు అందించడం జరుగుతుందన్నారు.జగ్గయ్యపేట కంపోస్ట్ పాడిన ఏపీ స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ ద్వారా పార్కుగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.స్వచ్ఛ సర్వేక్షన్ లో 73వ ర్యాంకులో ఉన్న జగ్గయ్యపేటను 50లోపు తీసుకురావాలని అధికారులకు సూచించారు.

జగ్గయ్యపేటలో 3 కోట్ల నిధులతో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు మంజూరైన రెండు ఎస్జిపిలను త్వరలో ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కొమ్మా రెడ్డి పట్టాభి, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, చైర్మన్ రాఘవేంద్ర లు ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జగ్గయ్యపేట బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత పై నిర్వహించిన సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మిరెడ్డి పట్టాభి కి ఆత్మీయ సన్మానాన్ని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, చైర్మన్ రాఘవేంద్ర బాలుర హై స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ,మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణారావు, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు కౌన్సిలర్లు ,టిడిపి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply