మహానగరానికి గోదావరి తాగునీటి సరఫరా పథకం కింద మంచినీటిని అందిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా బోర్డు కీలక అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12న నగరంలో మంచినీ సరఫరాకు అంతరాయం కలగనున్నట్టు ప్రకటించింది.
హైదర్‌నగర్ నుండి అల్వాల్ వరకు 1200 మి.మీ వ్యాసం కలిగిన ఎంఎస్ గ్రావిటీ ప్రధాన పైప్‌లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని.. దాని కారణంగా మంచినీటికి అంతరాయం కలగనుందని తెలిపింది.
ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనులు చేపడతామని బోర్డు తెలియజేసింది. ఈ 15 గంటల పాటు, జల్మండల్ ఓ అండ్ ఎం డివిజన్ -12 పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. మరికొన్ని ప్రాంతాలలో ఇది పాక్షికంగా ప్రభావితమవుతుందని అధికారులు తెలిపారు.
ప్రభావిత ప్రాంతాలలో షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, HMT సొసైటీ, HAL కాలనీ, TSIIC కాలనీ, రోడా మిస్త్రీ నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరా నగర్, గాజులరామరం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాష్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కైజర్ నగర్, గాజులరామరం గ్రామ ప్రాంతాలు ఉన్నాయి.
ప్రభావిత ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ నీటి ఏర్పాట్లు చేసుకుని, నీటిని తెలివిగా ఉపయోగించుకోవాలని HMWSSB కోరింది. మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే సాధారణ నీటి సరఫరా పునరుద్ధరింస్తామని బోర్డు తెలిపింది.