Free launch offer | జయత్రి ఇన్‌ఫ్రా ఎండీ అరెస్ట్

Free launch offer | జయత్రి ఇన్‌ఫ్రా ఎండీ అరెస్ట్

Free launch offer | చెన్నై, ఆంధ్రప్రభ : ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో వేలాది మంది కొనుగోలుదారులను మోసం చేసిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా (India) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్‌ను చెన్నైలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

బాధితుల ఫిర్యాదుల మేరకు తెలంగాణ పోలీసులు గతంలో శ్రీనివాస్‌ను అరెస్టు చేసినప్పటికీ, బెయిల్‌పై విడుదలైన అనంతరం అతను పరారీలోకి వెళ్లాడు. మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ, ఇటీవల చెన్నైలో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొస్తోంది. కంపెనీ ఆఫర్లతో మోసపోయిన వేలాది మంది కొనుగోలుదారుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Leave a Reply