కర్నూలు – ఎపిలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు.. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు..కర్నూలు పర్యటనలోఉన్న ఆయన అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పథకం వివరాలను వెల్లడించారు.. జిల్లాలో ఉన్న మహిళలు స్థానికత ఆధారంగా ఆ జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైన ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.. ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు.ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.. ఇక ఎన్టీఆర్ రైతు భరోసా కింద రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామన్నారు..కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు కలిపి రూ 14 వేలు ఇస్తామని ప్రకటించారు..అలాగే రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
Free Bus Scheme | ఎపిలో ఉచిత బస్సు ప్రయాణానికి ముహర్తం ఫిక్స్…
