ఘనంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ జ‌యంతి

ఘనంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ జ‌యంతి

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఉట్నూర్ ఎక్స్ రోడ్స్ సమీపంలోని శృతి వనంలో సోమవారం ఆదిలాబాద్ మాజీ ఎంపీ మాజీ జెడ్పీ చైర్మన్ బీజేపీ జాతీయ కౌన్సిలర్ స్వర్గీయ రాథోడ్ రమేష్ జ‌యంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయ‌న తనయులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ ఆయన సోదరుడు రాహుల్ రాథోడ్ కుటుంబ సభ్యులతో, బిజెపి పార్టీ నేతలు బంధువుల సమక్షంలో రాథోర్ రమేష్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాథోడ్ రమేష్ ఎంపీగా, జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చేసిన సేవలు మరువలేవ‌ని, ఆయన చిరస్మరణీయులని కొనియాడారు. ఇప్పటికి ఆయనకు ప్రజలలో ఆదరణ చెక్కుచెదరలేదన్నారు. అనంత‌రం రాథోడ్ రమేష్ అమరహే అంటూ నినాదాలు చేశారు.

ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ బానోతు రామారావు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి నే తావత్ రాందాస్, బీజేపీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, రాష్ట్ర నాయకులు న్యాయవాది భానోత్ జగన్ నాయక్, రాష్ట్ర మహిళా నాయకురాలు సుమన్ జాదవ్, బీజేపీ రాష్ట్ర కిషన్ మోర్చా నాయకులు దీపక్ సింగ్ షెకావత్, ఖానాపూర్ మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్ము రామచందర్, ఉట్నూర్ మాజీ జెడ్పీటీసీ సాడిగే గంగన్న, మాజీ ఎంపీటీసీలు కందుకూరి రమేష్, సాల్గర్ రవీందర్, బీజేపీ ఉత్తర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, ఓబీసీ మండల అధ్యక్షులు ఇప్ప మధుకర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, కడెం, ఖానాపూర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply