12 వార్డులో మాజీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 12వ వార్డు ఓటర్లు బిఆర్ఎస్ అభ్యర్థి గంట కళావతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఆదరిస్తే అభివృద్ధి చేస్తాం అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం రోజు పరకాల పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి బీఆర్‌ఎస్ 12వ వార్డు అభ్యర్థి గంట కళావతి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ అభ్యర్థి గంట కళావతి నిత్యం 12వ వార్డు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామని ధర్మారెడ్డి అన్నారు. అభ్యర్థి వెంట బిఆర్ఎస్ 12వ వార్డ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
