Delhi | మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. మెదడుకు శస్త్రచికిత్స కోసం ఢిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన చావ్లా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురైషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నవీన్ చావ్లా 2005 – 2009 వరకు ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా, ఆ తర్వాత 2009 ఏప్రిల్ నుంచి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా పనిచేశారు.