కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పల్లెల ప్రగతి సాధ్యం..

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పల్లెల ప్రగతి సాధ్యం..
- బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్.
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పల్లెల ప్రగతి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గ్రామాలఅభివృద్ధికి హితోదికంగా నిధులు మంజూరు చేస్తున్నారని నారాయణపేట బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, ఊట్కూర్ సర్పంచ్ ఎం రేణుక భరత్ అన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఈశ్వర్ మందిర్ వీధిలోఎంపీనిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందేందుకు పల్లె పట్టుకొమ్మలని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, ప్రధాని నరేంద్ర మోడీ గ్రామ జనాభా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రామాలు అభివృద్ధి చెందేందుకు సర్పంచ్ బ్యాంకు ఖాతాల్లో చేపట్టిన పనులకు నిధులు జమ చేస్తుందన్నారు. ఎంపీడీకే అరుణ నిధులు తీసుకోవచ్చి ఊట్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీలు సిసి రోడ్లు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
అభివృద్ధి చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులు మంజూరు చేస్తుందని బిజెపితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీడీకే అరుణ పాలనను మెచ్చుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించారనిగుర్తుచేశారు. ఐదేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ప్రతి బిజెపి నాయకులు , కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
ఊట్కూర్ పట్టణంలోని 16 వార్డులకుఎంపీ నిధులు తీసుకొచ్చివివిధ అభివృద్ధి పనులుచేపడతామన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మహిళగా గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, జిల్లా వాణిజశాల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కే గోపాల్, మండల మాజీ బీజేపీ అధ్యక్షులురమేష్, నాయకులు కార్యకర్తలు వెంకట్ నారాయణ అమీర్ తిమ్మప్ప రాజు తదితరులు పాల్గొన్నారు.
