HEALTH| బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కామారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గ్రామ బీజేపీ శాఖ రామాయంపేట లయన్స్ క్లబ్ స్నేహ బంధు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడిసిటీ ఆసుపత్రికి చెందిన వైద్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి కావలసిన మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు దామోదర్ రావు, గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

