న్యూ ఢిల్లీ – పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని ఆహార భద్రతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశీయ అవసరాలకు తగినంత బియ్యం, గోధుమలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. ఏవైనా ఘర్షణలు సుదీర్ఘకాలం కొనసాగినా, ప్రజల ఆహార అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. యుద్ధ పరిస్థితుల్లో కూడా దేశానికి ఆహార సరఫరాలో అంతరాయం ఉండబోదని స్పష్టంగా పేర్కొన్నారు.
Food Stocks | సమృద్ధిగా ఆహార నిల్వలు : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
