FOOD POISONING| అంగన్వాడి సెంటర్లో ఫుడ్ పాయిజన్

  • 8 మంది చిన్నారులకు తీవ్ర అస్వస్థత
  • నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం
  • విచారణకు ఆదేశించిన కలెక్టర్

FOOD POISONING| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడి సెంటర్లలో జరిగిన ఫుడ్ పాయిజన్ తో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మూడు అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి. ఓ సెంటర్లో 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు పాలు గుడ్లు సరఫరా చేశారు. అవి చిన్న వెంటనే 8 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో విద్యార్థులు తీవ్రస్వస్థకు గురయ్యారు. అంగన్వాడి సెంటర్లో నిర్వాహకులు ఇచ్చిన గుడ్లు, పాలు తినటంతో వారికి వాంతులు, విరేచనాలు చోటుచేసుకున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆత్మకూరు పట్టణానికి తరలించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి 4, మరో ప్రైవేట్ ఆస్పత్రిలో మరో 4 చికిత్సకు తరలించారు. నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఐసీడీఎస్ అధికారులకు మామూలు మత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల బాధ్యత రాహిత్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విచారణకు ఆదేశం..

జిల్లాలోని పాములపాడు మండలం మిట్టకంగాల గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో ఫుడ్ పాయిజన్ జరిగన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

అస్వస్థతకు గురైన పిల్లల వివరాలు..
సంపంగి రితిక, సురేంద్ర, ఋషి, నిశ్చిత్, సురేంద్ర, కృష్ణ, దేవేంద్రన్న ఈ చిన్నారులందరికీ నాలుగు సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులేనని తల్లిదండ్రులు తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాయుడు మాట్లాడుతూ… చిన్నారులు కలుషిత ఆహారం లేదా కలుషిత ఇతర పదార్థాలు తినటం తినటం, తాగడం వల్ల ఈ అస్వస్థతకు గురై ఉండవచ్చన్నారు. ప్రస్తుతం అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆహార, నీటి నమూనాలను పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించడం జరిగిందన్నారు. మండల స్థాయిలోని ఎంపీడీవో తాహశీల్దారు డాక్టర్లు అంగన్వాడి సెంటర్ కి వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply