Food Festival | ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Food Festival | ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Food Festival | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్(Food Festival) నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా తయారుచేసిన 59 రకాల పిండి వంటలను ప్రదర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద ఆద్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి వీణా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇంట్లో వండిన ఆహార పదార్థాల(food items) ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వినోద తెలిపారు. అనంతరం సర్పంచ్ సభ్యులను ఉపాధ్యాయ బృందంతో పాటు ఉపసర్పంచ్ బట్టు బాబయ్య, గ్రామ అభివృధి చైర్మన్ కుంట శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి రాంరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Food Festival |

Leave a Reply