గద్వాల, ఆంధ్రప్రభ : మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద నీరు కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్టులోకి 1.40 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువ ఉన్న సాగర్‌లోకి నీరు విడుదల చేశారు.
స్పిల్‌వే ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల
జూరాల ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులు బయటకు వెళ్తుండగా, విద్యుత్ ఉత్పత్తి కి 25,691 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 1,42,830 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.190 మీటర్ల కు చేరుకుంది. మొత్తం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను ఇప్పుడు 7.079 టీఎంసీలు ఉన్నాయి.