fisherman | పడవ బోల్తా…

fisherman | పడవ బోల్తా…
- మత్స్యకారుడు మృతి..
- ఒడ్డుకు చేరుకున్న నలుగురు
fisherman | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలోని వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు సోమవారం రాత్రి బోటు(boat)పై చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో అలల ఉధృతికి ఆ పడవ బోల్తా పడింది.
దీంతో నలుగురు మత్స్యకారులు కష్టపడి ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే చెక్క గోపాలరావు అనే మత్స్యకారుడు(fisherman) మాత్రం సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గోపాలరావు మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చారు. వజ్రపు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
