Fire Hazard | బస్సులో ఓ ఎమ్మెల్యే సహా మొత్తం 37 మంది..

Fire Hazard | బస్సులో ఓ ఎమ్మెల్యే సహా మొత్తం 37 మంది..

ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో కాసేపు భయాందోళన నెలకొంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరికి వెళ్తున్న ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక టైర్ పేలడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే స్పందించి, నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి కిందకు దింపాడు. దీంతో బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే సహా మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. అధికారులు ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply