- షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమా?
ఏర్పేడు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఏర్పేడు మండలంలోని విక్రతమాల సమీపంలో గల మునోత్ కంపెనీ(Munoth Company)లో భారీ అగ్నిప్రమాదం(fire) సంభవించింది. గురువారం తెల్లవారుజామున ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గ్రూప్ లిథియం కంపెనీలో మంటలు వ్యాపించడంతో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్(Security guard) పసిగట్టాడు. వెంటనే కంపెనీలోని యాజమాన్యానికి తెలియజేయడంతో కార్మికులను అప్రమత్తం చేసి బయటకు పంపించేశారు. వెంటనే ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి(CI Srikanth Reddy), ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు.
దాదాపు 70- 80 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం..
ఫైర్ సేఫ్టీ రీజినల్ అధికారి భూపాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని 6 ఫైర్ ఇంజన్లు(6 fire engines) సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కంపెనీలోని సెల్ ఫోన్ బ్యాటరీ చార్జర్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్(Electronic goods) పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.70- 80కోట్ల వరకు నష్టం జరిగినట్లు యాజమాన్యం అంచనా వేశారు. ప్రమాదాన్ని గల కారణాలు క్లూస్ టీం సాయంతో పోలీసులు విచారణలో తేలుతుందని ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) తెలిపారు. ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

