మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా వెనక టైరు పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాద సమయంలో మెుత్తం 40మంది ప్రయాణికులు ఉండగా.. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
Fire Accident |బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
