తోటి విద్యార్థులు ఆర్థిక సాయం…

తోటి విద్యార్థులు ఆర్థిక సాయం…
చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల చిట్యాల పట్టణ కేంద్రo 9వ వార్డ్ కి చెందిన మునుగోటి వెంకన్న మరణించిన సందర్బంగా వారి తోటి చిట్యాల zphs పాఠశాల లో చదువుకున్న 2006-2007 లో 10 th క్లాస్ చదువుకున్న మిత్రులు అందరు కలిసి 1,23,000 (అక్షరల ఒక లక్ష ఇరువై మూడు వేల రూపాయలు) వసూలు చేసి డబ్బులను చిట్యాల post ఆఫీస్ లో వెంకన్న కూతురు రేణుక పేరు మీద ప్రధాన మంత్రి సుకన్య యోజన పథకం కింద డిపాజిట్ చేసి పేపర్ ని వాళ్ల కుటుంబం సభ్యులకు అందచేయడం జరిగింది.
రాబోయే కాలoలో వారి కుటుంబ సభ్యులకు మేము వీలు ఉన్నంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాల నరేష్ గౌడ్, దమ్మల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్టా శేఖర్, కూరాకుల యాదగిరి పాల్గొన్నారు.
