Edapalli | నామినేషన్ల తుది జాబితా

Edapalli | నామినేషన్ల తుది జాబితా

విడుదల చేసిన ఎడపల్లి ఎంపీడీవో శంకర్

Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండల వ్యాప్తంగా 17 గ్రామపంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల తుది జాబితాను ఎంపీడీవో (MPDO) శంకర్ విడుదల చేశారు. మండల వ్యాప్తంగా 17 సర్పంచ్ స్థానాలకు గాను 110 మంది, 166 వార్డు స్థానాలకు గాను 389 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో తెలిపారు. జానకంపేట సర్పంచ్ స్థానానికి గాను 13 మంది నామినేషన్లు సమర్పించగా, నెహ్రూనగర్‌లో 10 మంది సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. అలాగే అంబం(వై)లో 5, ఏఆర్‌పీ క్యాంప్‌లో 9, బాపూనగర్‌లో 2, బ్రాహ్మణపల్లిలో 6, ధర్మారంలో 8, దుబ్బా తండాలో 4, జైతాపూర్‌లో 7, జమ్లం లో 4, కుర్నాపల్లిలో 5, మంగళ్ పహాడ్‌లో 6, ఎమ్మెస్సీ ఫారంలో 5, పోచారంలో 4, ఠాణాకలాన్‌లో 8, వడ్డేపల్లిలో 5, ఎడపల్లిలో 9 మంది సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేశారు.

Leave a Reply