Fertilizer | యాసంగి సీజన్ లో రైతులకు సరిపడా యూరియా

Fertilizer | యాసంగి సీజన్ లో రైతులకు సరిపడా యూరియా
Fertilizer | మోత్కూరు, ఆంధ్రప్రభ : యాసంగి సీజన్ కి సంబంధించి యూరియా సరఫరా పట్ల రైతులు ఆందోళన చెందవద్దని,రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుణ్యాల వెంకట రమణ రెడ్డి అన్నారు. ఈ రోజు స్థానిక ఫర్టిలైజర్(Fertilizer) షాప్ లను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఫర్టిలైజర్ యాప్ తో ఆయా దుకాణాలలో యూరియా స్టాక్ ను తనిఖీ చేశారు. రైతులు ఆందోళన చెందకుండా పంటకు సరిపడా యూరియాను సొసైటీ, ప్రైవేట్ డీలర్ల ద్వారా పట్టాదారు పాస్ బుక్ , ఆధార్ జిరాక్స్ కాపీలతో యూరియాను పొందవచ్చని స్పష్టం చేశారు. డీలర్ షాపుల వద్ద రిజిస్టర్ లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వి.కీర్తి పాల్గొన్నారు.
