Farooqnagar | క్షణాల్లోనే…

Farooqnagar | క్షణాల్లోనే…
Farooqnagar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధి ఫరూక్‌నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫరూక్‌నగర్ బస్ డిపో పక్కనున్న పరుపుల దుకాణంలో ఇవాళ మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
క్షణాల్లో దుకాణం అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. అంతేకాదు.. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు కూడా వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన స్పాట్‌కు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
