- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
MINISTER| గూడూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం గూడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కి స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. పెడన నియోజకవర్గంలోని పెడన గూడూరు మండలాల పర్యటనలో భాగంగా ఆయన గూడూరు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది పంట దిగుబడిపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కౌలు రైతులకు ప్రాధాన్యతనిస్తూ రైతు సేవ కేంద్రాల ద్వారా 50వేల టార్పాలిన్ పట్టాలను ఉచితంగా కౌలు రైతులకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కౌలు రైతు కార్డులు లేనప్పటికీ ఈ క్రాప్ ద్వారా పంట నమోదైన ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

