Grain | ధాన్యం కాంటా లేదు

Grain | ధాన్యం కాంటా లేదు
- కాజా రైతులు ఆందోళన
Grain | కూచిపూడి, ఆంధ్రప్రభ : కాంటాలు వేసినా ధాన్యం తరలించటం లేదని, నూర్చిన ధాన్యం కాంటాలు వేయటం లేదని మొవ్వ మండలం కాజ గ్రామస్తులు స్థానిక గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
తమ గోడును ఏ అధికారి పట్టించుకోవటం లేదని, ధాన్యం కొనే నాథుడు లేక ఆరబెట్టిన ధాన్యం(grain) వర్షానికి వాసన వేస్తున్నాయని, ఒక పక్క రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు గ్రామానికి చెందిన రైతులు(Farmers) పేకేటి సీతారామిరెడ్డి, రావులపాటి కాజిరెడ్డి, రామస్వామి, సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావులు పేర్కొన్నారు. త్వరగా అధికారులు స్పందించి కాటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, నూర్చిన ధాన్యాన్ని వెనువెం టనే కాటాలు వేయించాలని వారు కోరారు.
కూచిపూడి, మొవ్వ(Kuchipudi, Mowva), ఆవిరిపూడి, నిడుమోలు, భట్లపెనుమర్రు, పెడసనగల్లు, చినముత్తేవి, పెదపూడి తదితర గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
