ఈ పాల‌న వ‌ద్దంటూ నినాదాలు…

ఈ పాల‌న వ‌ద్దంటూ నినాదాలు…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి..

కోటగిరి, ఆంధ్రప్రభ : వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేదన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్, వృదులకు రూ.4వేలు పెన్షన్, నిరుద్యోగ భృతి, వితంతు, దివ్యాంగులు పెన్షన్, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం నరా బంగారం, రైతు భరోసా, భూ సమస్య వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకొని ఓటేసిన ఆ ప్రజలే ఈ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర నిరాశ చెందుతున్నరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చక పోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటు అనేక ఇబ్బందులకు గురవుతున్నా రని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం గద్దె దిగే వరకు ధర్నాలు, రాస్తా రోఖో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనేరు శశాంక్, హరి అలపాటి సీనియర్ నాయకులు పుల్లల మోహన్రావు, శ్యామల కులకర్ణి, వికాస్, జగదీష్, మామిడి సాయిలు, దౌలయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply