Family Suicide | ఒంటరితనమే ప్రాణం తీసిందా..?

Family Suicide | ఒంటరితనమే ప్రాణం తీసిందా..?
- పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
- ఘట్‌కేసర్ ఫ్యామిలీ సూసైడ్ కేసు..
- వెలుగులోకి కీలక విషయాలు
Family Suicide | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఈ రోజుల్లో ఒంటరితనంతో చాలామందిని వేధిస్తున్న సమస్య. ఒంటరిగా ఫీల్ అయ్యేవారు నలుగురితో కలవలేరు. అందరితో మాట్లాడలేరు. ‘నాకంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో’ అని బాధ పడుతూ ఉంటారు. ఇలాంటివారు ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలని చూస్తారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడూ వాళ్ల ఒంటరి ప్రపంచంలోనే గడుపుతుంటారు. ఇలాంటి వారికి బంధువులు, స్నేహితులు కూడా తక్కువగా ఉంటారు.
ఒంటరిగా ఫీల్ అవుతూ, తమపై తమకు ద్వేషం పెంచుకుంటారు. కారణం లేకపోయినా అనవసరంగా ఎప్పుడూ బాధ పడుతూ ఉంటారు. ఈ బాధతో కొంతమందికి విపరీతమైన ఆలోచనలు కూడా వస్తాయి. నెగెటివ్ ఆలోచనలతో ఒక్కోసారి తమ ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనుకాడరు. ఇలా ఒంటరితనంతో బాధ పడుతూ… ఓ మహిళ తన పిల్లలతో కలిసి ప్రాణాలను వదులుకున్న సంఘటన హైదరాబాద్‌లో కలకలం సృష్టించింది.
హైదరాబాద్ నగరం పరిధిలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరం పరిధిలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయ రెడ్డి ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. భర్త ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉండటం.. పిల్లలు హాస్టల్స్‌లో ఉండటంతో.. విజయారెడ్డి ఒంటరితనం భరించలేక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
సురేందర్‌రెడ్డి, విజయరెడ్డిలకు 2007లో వివాహమైంది. సురేందర్‌రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్‌లో ఉద్యోగం రావటంతో ఆయన అక్కడకు వెళ్లి జాబ్ చేస్తున్నారు. రాఘవేంద్రనగర్‌లో తల్లి పుష్పలతతో కలిసి విజయరెడ్డి ఉంటున్నారు. ఇంజినీరింగ్ చదివిన విజయారెడ్డి.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడ్ గా పనిచేస్తున్నారు. పిల్లలు హాస్టల్ లో ఉంటున్నారు. అయితే.. జనవరి 31న.. ఆత్మహత్యకు ముందు.. బంధువు చనిపోయారని చెప్పి హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొనివచ్చి రైల్వేస్టేషన్‌కు వెళ్లింది విజయరెడ్డి.. ఈ క్రమంలోనే పటాన్‌చెరు నుంచి అమ్మాయిని, ఘట్‌కేసర్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చింది.
తాను చనిపోవాలని అనుకుంటున్నట్టు కారులోనే పిల్లలకు చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. ఆ ముగ్గురూ స్టేషన్‌లో అరగంట పాటు అటుఇటు తిరిగినట్లు గుర్తించారు. ట్రైన్ వచ్చే సమయానికి ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ విజయారెడ్డి పార్కింగ్ స్లిప్‌పై సూసైడ్ నోట్ రాశారు.
పిల్లల భవిష్యత్తు కోసం భార్యభర్తల మధ్య దూరం పెరగడంతో ఆమెలో ఒక్కసారిగా ఒంటరి భావనను పెంచింది. కొద్దిరోజులు నెట్టుకొచ్చినా ఆ తర్వాత ఒంటరితనాన్ని భరించలేకపోయింది. పరిస్థితులు ఆమెని వెంటాడాయి. రెండువారాలుగా ఒంటరితనం మరింత కుంగదీసింది. ఈ విషయాన్ని బంధువులు, ఫ్రెండ్స్‌తో పదే పదే చెబుతూ బాధపడేది. చివవరకు తనతోపాటు ఇద్దరు పిల్లలు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
