IND vs AUS | గిల్ ఔట్.. టీమిండియా తొలి వికెట్ డౌన్ !

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేడు జ‌రుగుతున్న తొలి సెమీస్ లో.. ఆసీస్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. ఫైన‌ల్ బెర్త్ కోసం ఇరు జ‌ట్ల మ‌ద్య హోరాహోరీగా జ‌రుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. రోహిత్ సేన ముందు 265 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ క్ర‌మంలో ఛేజింగ్ కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.

ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన రోహిత్ అదిరే ఆరంభం ఇచ్చాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి ఓపెన‌ర్ గా వ‌చ్చిన గిల్ (8) ప‌రుగుల‌కే ఔట‌య్యారు. 4.6వ ఓవ‌ర్లో డ్వారిషూస్ వేసిన బంతికి పెవిలియ‌న్ చేరాడు గిల్. ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్ (21) – కోహ్లీ ఉన్నారు. 5 ఓవ‌ర్ల‌కు టీమిండియా స్కోర్ 30/1

Leave a Reply