నిలిచిన ఫ‌ల‌క్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

మిర్యాల‌గూడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : రైలు ఇంజిన్‌లో ఏర్ప‌డిన సాంకేతిక‌లోపం కార‌ణంగా ఈ రోజు హౌరా టూ సికింద్రాబాద్ ఫ‌ల‌క్‌నుమా సూప‌ర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. స‌మాచారం అందుకు సాంకేతిక సిబ్బంది మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. అనంత‌రం సికింద్రాబాద్‌కు బ‌య‌లుదేరింది. సుమారు గంట‌కు పైగా రైలు నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డ్డారు. హైద‌రాబాద్‌లో వివిధ ఆఫీసుల‌కు వెళ్లాల్సిన వారు స‌కాలంలో చేర‌లేమ‌న్న ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

Leave a Reply