Exise War | చైనా పై 104 శాతం సుంకం విధించిన ట్రంప్

వాషింగ్టన్ – తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దీంతో ప్రపంచ దేశాలు కంగుతిన్నాయి. కాగా.. అమెరికా విధిస్తున్న సుంకాల పై చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని వెల్లడించారు. ఐరోపా కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డిర్‌తో ఫోన్‌ కాల్‌ సందర్భంగా లీ కియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

.”’సుంకాల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. దీనిపై మేం చివరి వరకు పోరాడుతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపై ట్రంప్‌ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలను అద్దం పడుతున్నాయి. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాల కోసమే గాక.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడుతాం” అని చైనా ప్రీమియర్‌ వెల్లడించారు.అసలెక్కడ మొదలయ్యిందంటే:అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్‌ దేశం చైనా మధ్య టారిఫ్‌ వార్‌ మరింత ముదిరింది.

అమెరికా ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై చైనా ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్‌ దేశం సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అయితే, సుంకాలను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే మరింత సుంకాలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. చైనా వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్‌ అన్నంత పని చేశారు. చైనా వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. తాజా సుంకాలతో 104శాతానికి సుంకాలు చేరాయి. కొత్తగా ప్రకటించిన సుంకాలు రాత్రి (అమెరికా స్థానిక కాలమానం) 12.01గంటల నుంచి అమలులోకి వస్తాయని వైట్‌హౌస్‌ వెల్లడించింది.ఏప్రిల్‌ 2న అమెరికా చైనాపై 34శాతం సుంకాలను విధించింది. దీనికి స్పందనగా డ్రాగన్‌ దేశం సైతం అగ్రరాజ్యంపై 34శాతం సుంకాలు విధించింది. చైనా కొత్తగా ప్రకటించిన 34శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే 50శాతం అదనంగా సుంకాలను ప్రకటిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఏప్రిల్‌ 9 నుంచి అమలులోకి వస్తాయని.. దాంతో పాటు చైనాతో అన్ని చర్చలు సైతం రద్దు చేస్తామని స్పష్టంచేశారు.

దీనికి అమెరికా ప్రతీకార సుంకాలు ఏకపక్షమని.. రెచ్చగొట్టడమేనంటూ చైనా స్పందించింది. తాము సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించామని.. భవిష్యత్‌లోనూ మరిన్ని సుంకాలు పెంచుతామని ఘాటుగా బదులిచ్చింది.చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ . తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో ప్రపంచ దేశాలు కంగుతిన్నాయి. కాగా.. అమెరికా విధిస్తున్న సుంకాల పై చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ తీవ్రంగా స్పందించారు.

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని వెల్లడించారు. ఐరోపా కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డిర్‌తో ఫోన్‌ కాల్‌ సందర్భంగా లీ కియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నెక్స్ట్ టార్గెట్ పార్మా పైనే

ఇప్ప‌టి వ‌ర‌కు నిత్యావ‌స‌రాలు, పెట్రో, ఎల‌క్ట్రానిక్ రంగాల‌పై సుంకం పోటు వేసిన ట్రంప్ త‌న త‌దుప‌రి టార్గెట్ ఫార్మా పైనే అని ప్ర‌క‌టించారు.. త్వ‌ర‌లోనే ఫార్మా పైనే సుంకాలు వేస్తామ‌ని తేల్చి చెప్పారు. ఈ సుంకాల కార‌ణంగా అమెరికాలో ఫార్మా సంస్థ‌లు త‌ర‌లివ‌స్తాయనే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.. కాగా, ఫార్మా ఉత్స‌త్తుల‌ను అత్య‌ధిక శాతం అమెరికా మ‌న దేశం నుంచే దిగుమ‌తి చేసుకుంటున్న‌ది.. మ‌రి ముఖ్యంగా ఫార్మాకు హ‌బ్ గా ఉన్న తెలంగాణ నుంచి అథికంగా అమెరికాకు వెళుతున్నాయి.. ట్రంప్ సుంకాల పెంపు నిర్ణ‌యం తెలంగాణలోని ఫార్మా రంగంపై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు..

ట్రంప్ పై ఎలాన్ మ‌స్క్ గ‌రం

హ‌ద్దు అదుపు లేకుండా సుంకాల‌పై సుంకాలు వేస్తున్న ట్రంప్ పై ఆయ‌న స‌ల‌హాదారుగా ఉన్న అప‌ర బిలియ‌న‌ర్ ఎలాన్ మ‌స్క్ త‌ప్పు ప‌ట్టారు. ఈ త‌ర‌హ విధానాల వ‌ల్ల న‌ష్టం పోయేది అమెరికానే అంటూ స్ప‌ష్టం చేశారు.. వెంట‌నే ట్రంప్ త‌న విదానాల‌ను మార్చుకోవాల‌ని కోరారు.. అలాగే ట్రంప్ కు అర్థిక స‌ల‌హాదారుగా ఉన్న వ్య‌క్తి మూర్ఖుడంటూ వ్యాఖ్య‌నించాడు.. అత‌డి స‌ల‌హాల వ‌ల్లే ట్రంప్ తప్పుడు మార్గంలో న‌డుస్తున్నారంటూ విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *