Endapalli | గ్రామ అభివృద్ధే లక్ష్యం
ఎండపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రజియా బషీర్
Endapalli | ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ప్రజలతో మమేకమై, సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతూ, తనదైన శైలిలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి మోహమ్మద్ రజియా బషీర్ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నారు. ప్రతీ వీధి.. ప్రతీ ఇంటిని సందర్శిస్తూ గ్రామ అభివృద్ధే లక్ష్యమని, పారదర్శక పాలనతో పాటు శుద్ధి నీటి సరఫరా, రహదారి మరమ్మతులు, కాలువల శుభ్రత, వృద్ధులు,మహిళలకు అవసరమైన సేవలు అందించడమే ప్రధాన అజెండాగా రజియా బషీర్ అని వివరిస్తున్నారు. సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

