ElonMusk | నా బిడ్డ‌కు మ‌స్క్ తండ్రి – బాంబు పేల్చిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి క్లైయిర్

ప్రైవ‌సీ కోసం ఎవ‌రికీ చెప్ప‌లేదు
అందుక‌నే విష‌యాన్ని గోప్యంగా ఉంచాం
ఎక్స్ వేదిక‌గా విష‌యాన్ని షేర్ చేసిన ఆష్లీ
స‌రికొత్త చిక్కుల్లో టెస్లా అధిప‌తి ఎలన్‌
ఇప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గిరితో ఆ త‌ర‌హా రిలేష‌న్‌
త‌న‌కు 12 మంది సంతానం అంటూ వెల్ల‌డించిన‌ మ‌స్క్‌
తాజా ఘ‌ట‌న‌తో 13 మందికి చేరిన పిల్ల‌ల సంఖ్య‌

కాలిఫోర్నియా, ఆంధ్ర‌ప్ర‌భ : నా బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అంటూ ఓ రచయిత్రి సంచలనానికి తెరలేపారు. అయిదు నెలల క్రితం తానొక బిడ్డకు జన్మనిచ్చానని.. ఆ బిడ్డకు తండ్రి ఎలన్ మస్క్ అని అమెరికా రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్‌ చెప్పుకొచ్చారు. తామిద్దరం దీన్ని గోప్యంగా ఉంచాలనుకున్నామని కొన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేశాయ‌ని ఆమె తెలిపారు. మా బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని క్లెయిర్ ట్వీట్ చేశారు. మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్ద‌ని ‘ఎక్స్’ వేదికగా అస‌లు విష‌యాన్ని షేర్ చేసింది. దీంతో ఎలన్ మస్క్ వివాదంలో ఇరుక్కున్నారు.

మ‌స్క్‌కు మొత్తం 13 మంది సంతానం..

మరోవైపు టెస్లా అధినేత మస్క్‌కు 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ త‌ర్వాత‌ 2008లో వారిద్దరూ విడిపోయారు. దీని త‌ర్వాత‌ బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. వీరిద్దరూ కలిసి ఉన్నారో లేదో తెలియదు. కానీ, ఎలన్ మ‌స్క్ ప్రస్తుతం కెనెడియన్ గాయని గ్రిమ్స్‌తో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారు. వీరందరూ కాక రీసెంట్‌గా తనకు మరో ముగ్గురు పిల్లలున్నట్లు మస్క్ తానే స్వయంగా ప్రకటించారు. తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్‌ న్యూరాలింక్‌లో పనిచేస్తున్న‌ ఎగ్జిక్యూటివ్‌తోనూ మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఆయన పిల్లల సంఖ్య 12కు చేరుకుంది. ఇప్పుడు ఆష్లీకి పుట్టిన బిడ్డతో కలిపి ఎలన్‌కు 13 మంది పిల్లలున్నట్లు స్ప‌ష్టం అవుతోంది.

కొడుకుమీద కోపంతోనే.. ట్రాన్స్‌జెండ‌ర్లు బ్యాన్

ఇక.. ఎలన్ మస్క్, ఆయన మొదటి భార్య జస్టిన్‌కు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్‌ ప్రకటించారు. ఈ కోపంతోనే ఎలన్ మస్క్ మొత్తం అమెరికాలోనే ట్రాన్స్ జెండర్స్‌కు హక్కులు లేకుండా చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ మీద ఒత్తిడి తీసుకువచ్చారని వార్తలు వచ్చాయి. ట్రంప్ ట్రాన్స్ జెండర్ ఫైల్ మీద సంతకం చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *