దళిత గృహాలకు సూర్యఘర్ వెలుగులు..

దళిత గృహాలకు సూర్యఘర్ వెలుగులు..
సరుబుజ్జిలి(ఆమదాలవలస), ఆంధ్రప్రభభ : విద్యుత్ బిల్లుల భారం నుంచి దళిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎస్సీ/ఎస్టీ సూర్యఘర్ యోజన అద్భుతమైన అవకాశమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సరుబుజ్జిలి మండలం మర్రిపాడు, బురిడివలస గ్రామాల్లో ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్యఘర్ యోజన ఉత్సవ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు నిర్వహించే ఈ ఉత్సవాల ద్వారా ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత సోలార్ పవర్ ఏర్పాటుతో పాటు, పాత విద్యుత్ బకాయిలపై ప్రత్యేక రాయితీలు, సులభ వాయిదాల పద్ధతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యనారాయణ, విద్యుత్ శాఖ డీఈ యోగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు అంబల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
