elections | భారీ మెజార్టీతో గెలిపించాలి..
- మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
elections | పరకాల, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(Challa Dharma Reddy) ప్రజలను కోరారు. ఈ రోజు పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి, వెల్లంపల్లి, పోచారం, అలియాబాద్ గ్రామాలలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వార్డుల వారిగా నియమించిన ఇంచార్జులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటరుని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను వివరించాలని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ప్రజలకు గుర్తుచేయాలన్నారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
సాదారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడ అమలుచేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లకోసం వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చి అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఓటమి భయంతో సర్పంచ్ ఎన్నికల్లో(elections) కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటువేయకుంటే సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆపేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరంలేదని ప్రజలకు అండగా ఎల్లప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

