Election | వెరీ పీస్‌ఫుల్‌గా…

Election | వెరీ పీస్‌ఫుల్‌గా…
- కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలు
- గుండాల మండలంలో 72 శాతం, ఆళ్లపల్లిలో 71శాతం
Election | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మండలాల్లో ఉదయం 11:30 గంటలకు 70 శాతం పోలింగ్ పూర్తయ్యిందని ఆళ్లపల్లి ఎంపీడీవో ధీరావత్ శ్రీను, గుండాల మండల ఎంపీడీవో బాలరాజు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మండలాల్లో మూడో విడత సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నిక పోలింగ్(Polling) బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.
మండలం గ్రామపంచాయతీలలో ఓటర్లు బారులు దీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, స్థానిక ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్, తహసీల్దార్ జగదీష్‌లు బూత్‌లను వేర్వేరుగా పర్యవేక్షించారు.
