రైల్వే క్రాస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా…

రైల్వే క్రాస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే నూతనంగా ఏర్పాటు చేయనున్న వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్(Vikarabad Krishna Railway Line) ఏర్పాటులో భాగంగా నారాయణ పేట జిల్లా ఊట్కూర్ రైల్వే క్రాస్ లైన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన రైల్వే స్టేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఎంపీ డీకే అరుణను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. పాత డీపీఆర్ లో ఊట్కూర్ రైల్వే స్టేషన్ ఉందని ప్రస్తుతం విడుదల చేసిన డీపీఆర్ లో ఊట్కూర్ క్రాస్ స్టేషన్(Ootkur Cross Station) లేదని దృష్టికి తీసుకువచ్చారు. రైల్వే క్రాస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్(Railway Station) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ ఊట్కూరు వద్ద రైల్వే క్రాస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సాధన సమితి నాయకులు ఎం. భాస్కర్, డి యగ్నేశ్వర్ రెడ్డి, సి. సూర్య ప్రకాష్ రెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి, డి .హన్మంతు, వెంకటేష్, శంకర్ర, వికుమార్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
