Education | విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం…

Education | విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం…
- మేడ శంకరయ్య.- సుశీలమ్మ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం
- విప్పలమడక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తా ..
- వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్
Education | వైరా, ఆంధ్రప్రభ : విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అన్నారు. వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సుమారు రూ. 15 వేల విలువచే సే షూలు, సాక్సులు, బెల్ట్లు, ట్రైలూ, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు వాటిని అంద చేశారు. అనంతరం కట్ల సంతోష్ మాట్లాడుతూ విప్పలమడక గ్రామానికి తమ కుటుంబానికి 30 ఏళ్లగా అవినాభావ సంబంధం ఉందని చెప్పారు.
తమ వ్యాపార కార్యకలాపాలకు విప్పలమడక గ్రామం కీలకంగా ఉండేదని పేర్కొన్నారు. మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలో ప్రశంసనీయమని కొనియాడారు. విప్పలమడక గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో మంచి పాలకవర్గాన్ని ఎన్నుకోవడంతోనే విప్పలమడక గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు నెలల కాలంలోనే మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ విప్పలమడక గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
సామాజిక సంస్థలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భువనేశ్వరరావు మాట్లాడుతూ మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తితో తన తల్లి పేరుతో పోతినేని సరోజని చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ నూతన ట్రస్ట్ ఆధ్వర్యంలో విప్పలమాడక గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బూర్గులూర్థమ్మ, మాజీ సర్పంచులు పారుపల్లి కృష్ణారావు, తుమ్మల జాన్ పాపయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, గ్రామ కార్యదర్శి కాంపల్లి ధనమ్మ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు దొంతెబోయిన సత్యనారాయణ, వార్డు సభ్యులు ముత్తమాల నాగజ్యోతి, పారుపల్లి నిఖిత, గరిడేపల్లి శ్రీనివాసరావు, కాశీ మాల సామేలు, బూర్గునందిని తదితరులు పాల్గొన్నారు.
