పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం…

పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం…

ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్

పాయకాపురం, ఆంధ్రప్రభ : పవిత్ర ఈస్టర్ మాసంలో క్రైస్తవ సహోదరులు ఎంతో కఠిన ఉపవాస, నియమములతో దేవుడిని ప్రార్ధిస్తుంటారు. ఎందుకంటే దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు అనే నామముతో భూలోకములో జన్మించి,తన్నుతాను మహిమస్వరూపం తగ్గించుకొని కల్వరి సిలువలో తనప్రజల పాపపరిహార్దం సిలువ యాగం చెందారు. అందుకే ఆదినాన్ని శుభ శుక్రవారంగా పిలుస్తారు. ఐతే మూడోరోజున తాను సమాధి నుండి బయటకు వస్తానని బైబిల్లో చెప్పినట్లుగా పునర్ధానుడిగా ఆయన మహిమా స్వరూపం ధరించుకొని ప్రజలకు కనబడటం ఈస్టర్ పర్వదినముగా ప్రపంచ దేశములోని క్రైస్తవ సహోదరులు పాటిస్తారు.

ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్నీ క్రైస్తవ సంఘాల క్రైస్తవ సహోదరులు పలు చర్చిలలో ఈస్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగ్ నగర్ బీసీటీసీ కార్యాలయంలో, గిద్యోను ప్రార్ధనా మందిరములో ఈస్టర్ సందర్భంగా జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పాయకాపురం కల్వరి ప్రేమ ప్రార్ధనా, మందిరములో ఈస్టర్ సందర్భంగా పాస్టర్ రెవ. కిరణ్ కుమార్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ప్రేమ విందు నిర్వహించారు.పైపులా రోడ్డు సెంటర్ ప్రాంతంలో సీయోను అసెంబ్లీ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Leave a Reply