Earthquake | మహారాష్ట్రలో భూకంపం..

Earthquake | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలో ఇవాళ భూకంపం సంభవించింది. దాదాపు 8 గ్రామాలలో రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఆకస్మిక ప్రకంపనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply