AP | ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు

  • ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు కొనసాగనున్నారు… ప్రస్తుతం ఏపీ డీజీపీ, ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావును మళ్లీ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏడాదిపాటు వైస్‌ చైర్మన్‌, ఎండీగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *