Duggirala | ప్రియుడుతో కలిసి భార్య ఘాతుకం

Duggirala | ప్రియుడుతో కలిసి భార్య ఘాతుకం
- అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య
- ఆలస్యంగా వెలుగులోకి విషాద ఘటన
Duggirala | దుగ్గిరాల, ఆంధ్రప్రభ : తండ్రి హత్యచేయబడి… తల్లి జైలుకెళ్లి ఇద్దరూ పిల్లలు అనాధలుగా చేసింది వివాహేతర సంబంధం. అన్యోన్య సంసారంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తనే హతమార్చిన సంఘటన గ్రామంలో విషాదఛాయాలని నింపింది. పచ్చని పంటపొలాలు వ్యవసాయ పనులతో కళకళలాడే గ్రామంలో ఎన్నడూ చూడని, జరగని ఘటన ఆందోళన కలిగించింది.
వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తని భార్య సినీ పక్కిలో హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలువూరుకి గ్రామానికి చెందిన లోకం శివనాగరాజు గత మూడు రోజుల క్రితం మృతి చెందాడు. అనారోగ్య కారణాలతో భర్త మృతి చెందాడని భార్య బంధువులకి తెలిపింది.
అయితే బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్ మార్టంకి పంపారు. పోస్ట్ మార్టం నివేదిక ఈ రోజు రావడంతో అనుమాస్పద మృతి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడికి భార్య లక్ష్మి మాధురి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
హత్యగా పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక
చిలువూరు గ్రామంలో అనుమానస్పద మృతిగా నమోదైన లోకం శివనాగరాజు కేసు పోస్ట్ మార్టం నివేదిక సంచలనం విషయాలు బయటపెట్టింది. భార్య స్థానికులకి గుండె నొప్పివచ్చి శివ నాగరాజు చనిపోయినట్లు చెప్పిన విషయంలో నిజం లేదని నివేదిక ఆధారంగా దుగ్గిరాల పోలీసులు భార్య లక్ష్మి మాధురిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో ప్రియుడుతో కలిసి భార్య మాధురి భర్తని హత్య చేసినట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రియుడుతో వివాహేతర సంబంధం కొనసాగించడానికి అడ్డుగా ఉన్నట్లు గుర్తించి కట్టుకున్న భర్తనే చంపినట్లు పేర్కొన్నారు. మత్తులోనికి వెళ్లేలా ఆహారంలో భర్తకి మత్తు పదార్థం కలిపి, అనంతరం చాతీపై గట్టిగా కొట్టినట్లు ఎముకలు విరిగినట్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. సమాజంలో విలువలు కోల్పోయేలా దారుణం హత్యగా చేసినట్లు తెలుస్తుంది.
హత్యకి కారణం వివాహేతర సంబంధం..!.
చిలువూరు గ్రామానికి చెందిన మృతుడు లోకం శివ నాగరాజుకి లక్ష్మి మాధురితో 2007లో వివాహం జరుగగా వారికి ఇద్దరు మగ సంతానం. మృతుడి శివనాగరాజు భార్య లక్ష్మి మాధురి విజయవాడలో పనిచేస్తున్నప్పుడు గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు అది వివాహేతర సంబంధంగా మారింది. గతంలో ఇతర ప్రాంతంలో వ్యాపారం చేసిన శివనాగరాజు గత కొంతకాలంగా ఇంటి వద్దనుండే వ్యాపారం కొనసాగిస్తుండటంతో ప్రియుడితో సంబంధం కొనసాగించడానికి అడ్డంగా మారింది.
ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోడం జరిగినట్లు తెలుస్తుంది. దీనితో ప్రియుడు గోపి తో కలిసి హత్యకి పథకం వేసింది. ఈనెల 18న బిర్యానీలో మత్తు బిళ్లలు వేసి అనంతరం ప్రియుడి గోపితో కలిసి లక్ష్మి మాధురి హత్య సేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. అదేవిధంగా రాత్రి మొత్తం భర్త మృత దేహం వద్దనే పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్నట్లు విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అక్రమ సంబంధం కుటుంబాన్ని ఛిద్రం చేసి ఇద్దరు పిల్లల్ని అనాధలుగా మిగిల్చింది.
