Droupadi Murmu | అమరావతి బిల్లుకు ఆమోదం ఇచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు

Droupadi Murmu | అమరావతి బిల్లుకు ఆమోదం ఇచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు
Droupadi Murmu | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మంత్రి నారా లోకేష్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన లోకేష్, రాష్ట్రపతి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేశారు.
అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంగా, రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేసినట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా “తనకు కాదు, అమరావతి రైతులకు కృతజ్ఞతలు చెప్పాలి” అని రాష్ట్రపతి పేర్కొన్నారని తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు విజనరీ నాయకత్వం ఉన్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నయుడు ఉన్నారని రాష్ట్రపతి ప్రశంసించినట్లు చెప్పారు. సాక్షాత్తు రాష్ట్రపతి ఏపీ సీఎంను అభినందించడం గొప్ప విషయమని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఒక ఆంధ్రుడిగా సీఎం చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని, కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ప్రశంసించడం విశేషమని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక నేపథ్యం, రాజధాని నిర్మాణ అవసరాన్ని రాష్ట్రపతికి వివరించినట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
