స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి….

స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి….
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం…
గుడివాడ, ఆంధ్రప్రభ : గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని శుద్ది చేసే విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. ప్రజావేదికలో పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రా వాటర్, ఫిల్టర్ చేసిన నీటి నమూనాలను ఎమ్మెల్యే వెనిగండ్లకు చూపించారు.
పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల పంచాయతీ రాజ్ అధికారుల పనితీరు పట్ల ఆసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 70 శాతం గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు కనీసం అవసరాలకు సైతం పనికి రాని విధంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్నారు.
ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా రక్షిత మంచినీటి పథకాలకు నిధులు ఇస్తున్నా, వాటిని సరిగ్గా వినియోగించుకోలేని దుస్థితి నెలకొందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సరఫరా చేసే సమయంలో సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులు ఉండటం లేదని, ట్యాంకు ఆపరేటర్లు నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీడీ వోలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, సమస్యను పరిష్కరించా లని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఏపీ ఎస్డబ్ల్యుసి చైర్మన్ రావి వెంకటేశ్వర్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,ఎంపీడీ వోలు బి.వై విష్ణుప్రసాద్, నాగమల్లే శ్వరీ, ఇమ్రాన్, పబ్లిక్ హెల్త్ DE సత్య పాండురంగారావు, AE దిలీప్ కుమార్, మెగా ఇంజనీరింగ్ సురేష్,ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు పాల్గొన్నారు.
